ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోద్రాసవ

ABN, First Publish Date - 2021-01-12T18:09:49+05:30

ఆయుర్వేద వైద్యంలో స్త్రీల అనారోగ్య సమస్యల చికిత్సకు, ఎక్కువగా ఉపయోగించే ఔషధాలలో లోద్రాసవ ఒకటి. లోద్రాసవ తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(12-01-2020)

ఆయుర్వేద వైద్యంలో స్త్రీల అనారోగ్య సమస్యల చికిత్సకు, ఎక్కువగా ఉపయోగించే ఔషధాలలో లోద్రాసవ ఒకటి. లోద్రాసవ తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంథమైన అష్టాంగ హృదయంలోని చికిత్సావిభాగంలో నాలుగు శ్లోకాలలో చెప్పబడింది. అదేవిధంగా ఈ ఔషధం ఆయుర్వేదిక్‌ ఫార్మేషన్స్‌ ఆఫ్‌ ఇండియా నందు నమోదు చేయబడింది.


లోద్రాసవ తయారీలో ముఖ్యమైనది లోద్రుగ. దీనికి సంస్కృతంలో లోద్ర, ఖిల్లీ, తిల్వక, తిరీటిక అని వివిధ పేర్లు ఉన్నాయి. ఈ చెట్టు బెరడును ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. లోద్రాసవని 29 రకాల మూలికలు, పదార్థాల సంకలనం చేసి, ఆసవ విధానంలో తయారుచేస్తారు. వీటిలో ముఖ్యమైనవి లోద్ధుగ, చాగ, గంధకచెరమలు, వాయువిడంగాలు, గంటు, భారంగి, కోడిశకపాల, అతివస, చిత్రమూలము, నేలమేము, కటుకరోహిణి, పుష్కరమూలము, త్రిఫల మొదలైనవి.


లోద్రావస ఉపయోగాలు: మేహము, ఆర్శీస్సు శ్వితకుష్టము, అరుచి, క్రిమిరోగుములు పాండు, చర్మ రోగములు, గ్రహిణి, సౌల్యరోగము మొదలైన వాటి చికిత్సల్లో ఉపయోగరకరం.


మా అనుభవంలో తెలిసిన మరికొన్ని ఉపయోగాలు: - ఆడవారికి నెలసరి సమయంలో ఏర్పడే దద్దుర్లు వంటి సమస్యలకు లోద్రాసవ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా గర్భాశయ సంబంధిత సమస్యలు, పి.సి.ఒ.డి, చాక్లెట్‌ సిస్ట్‌ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఔషధం వాడడం వల్ల ఫలితం ఉంటుంది. గర్భాశయ సంబంధిత సమస్యలు ఉండి, గర్భం నిలబడని వారికి ఈ ఔషధం అనుపానంగా ఉపయోగపడుతుంది. ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమం (ఐబీపీఎస్‌) సమస్యతో బాధపడేవారికి, కొన్ని శరీరతత్వాలకు ఈ ఔషధం అనుపానంగా ఉపయోగపడుతుంది.


ఉపయోగించే మోతాదు

దీనిని పెద్దలు 10 మి.లీటర్లు, పిల్లలు 5 మిల్లీ లీటర్లు ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచన మేరకు వాడవలెను. ప్రస్తుతం ధూత్‌ పాపేశ్వర‌, బైద్యనాధ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు లోద్రాసవను తయారుచేస్తున్నాయి. 


శశిధర్‌ అనువంశిక 

ఆయుర్వేద వైద్యనిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, 

కొత్తపేట్‌, చీరాల.




Updated Date - 2021-01-12T18:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising