ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయం కంటే రాత్రి వేళ శరీరం ఎక్కువ బరువు ఉంటుందని మీకు తెలుసా..?

ABN, First Publish Date - 2021-08-24T18:31:46+05:30

శరీర తత్వాన్ని బట్టి శరీర బరువుల్లో తేడాలుంటాయి. ఎక్కువ బరువును అనారోగ్య లక్షణంగా భావించడం తగదనీ, ఎలాంటి శరీర బరువుతోనైనా ఫిట్‌గా ఉండే వీలు ఉంటుందనీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి (24-08-2021): శరీర తత్వాన్ని బట్టి శరీర బరువుల్లో తేడాలుంటాయి. ఎక్కువ బరువును అనారోగ్య లక్షణంగా భావించడం తగదనీ, ఎలాంటి శరీర బరువుతోనైనా ఫిట్‌గా ఉండే వీలు ఉంటుందనీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ అంటున్నారు. బాడీ వెయిట్‌ గురించిన మూడు వాస్తవాలను ఆమె ఈ విధంగా వివరిస్తున్నారు.


ఫ్యాట్‌నెస్‌ - ఫిట్‌నెస్‌: శరీర బరువును ఫిట్‌నెస్‌కు కొలమానంగా ఎంచడం తగదు. అలాగే అధిక బరువును శరీరంలో పేరుకున్న కొవ్వుకు సూచనగా భావించడం కూడా తగదు. కాబట్టి బరువు తగ్గనంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదు. బరువు కంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం. కండరాలు, ఎముకలు, కొవ్వు, నీరు... శరీర బరువులో ఇవన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి శరీర బరువును కొవ్వుతో సరిపోల్చకూడదు. వెయింగ్‌ స్కేల్‌ మీద కనిపించే శరీర బరువు మీ ఫిట్‌నెస్‌ లెవల్‌ లేదా ఒబేసిటీకి కొలమానం కాదని గుర్తుంచుకోవాలి.


కాలం, వయసు: ఒక రోజులో కొన్ని గ్రాముల మొదలు కిలోల వరకూ శరీర బరువులో తేడాలు చోటు చేసుకునే వీలుంది. శరీరంలోని నీటి పరిమాణం, ఉదయం నుంచి రాత్రి లోపు మనం తాగే నీళ్ల హెచ్చుతగ్గులే ఇందుకు కారణం. అలాగే చెమటపట్టడం, వేడికి ఒంట్లో నీరు ఆవిరవడం, మూత్రవిసర్జన, ఆహార వేళలు, పేగుల కదలికలు కూడా శరీర బరువు మీద ప్రభావం చేపిస్తాయి. ఉదయం కంటే రాత్రి వేళ శరీరం ఎక్కువ బరువుగా ఉంటుంది. అలాగే వయసుతో పాటు, మారే కాలానికి తగ్గట్టు శరీర బరువుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ ఉంటాయి.


ఎంతటి బరువున్నా: ఎలాంటి శరీర బరువుతోనైనా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండే వీలుంది. అయితే పూర్తి ఆరోగ్యం సురక్షిత పరిఽధిలోనే ఉండేలా చూసుకోవాలి. శరీర కదలికలన్నీ సౌకర్యవంతంగా, రోజంతా సరిసమానమైన శక్తి కలిగి ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామాలతో శరీర బరువు గురించి దిగులు చెందకుండా ఆరోగ్యంగా, ఫిట్‌గా జీవించే వీ

Updated Date - 2021-08-24T18:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising