ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడుమే అందం..

ABN, First Publish Date - 2021-12-28T16:04:05+05:30

మన శరీరం మొత్తంలో ధృఢమైన కండరాలు పిరుదులే! అయితే మహిళల్లో కటి ప్రదేశంలో పేరుకునే కొవ్వు వల్ల ఆ ప్రదేశం ఆకారం కోల్పోతూ ఉంటుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-12-2021)

మన శరీరం మొత్తంలో ధృఢమైన కండరాలు పిరుదులే! అయితే  మహిళల్లో కటి ప్రదేశంలో పేరుకునే కొవ్వు వల్ల ఆ ప్రదేశం ఆకారం కోల్పోతూ ఉంటుంది. అలా కాకుండా, చూడచక్కని రూపం సంతరించుకోవాలంటే  ఈ యోగాసనాలు సాధన చేయాలి. 


వీరభద్రాసనం

రెండు కాళ్లూ వీలైనంత దూరం ఉంచి నిలబడాలి.


ఈ భంగిమలో కుడి మోకాలు, కాలి గిలకకు సమాంతరంగా, ఎడమ తొడ నేలకు సమాంతరంగా ఉండాలి.


గాలి పీల్చుకుని వదులుతూ, ఎడమవైపు తిరుగుతూ, ఎడమ మోకాలు కాలి గిలకకు సమాంతరంగా ఉంచి నిలబడాలి.


ఈ భంగిమలో కుడి తొడ నేలకు సమాంతరంగా ఉంటుంది. చేతులు, కాళ్లు, తొడలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి.



శలభాసనం

పొట్ట మీద బోర్లా పడుకోవాలి.


భుజాలు, తల, కాళ్లూ గాల్లోకి వీలైనంత లేపాలి.


చేతులు శరీరానికి ఆనించి ఉంచాలి.


నడుమును నేలమీద ఆనించి, బలంగా తల, కాళ్లు, భుజాలు పైకి లేపాలి.


ఈ భంగిమల్లో వీలైనంత ఎక్కువ సమయం పాటు ఉండి తిరిగి యఽథాస్థానంలో పడుకోవాలి. ఈ ఆసనంతో నడుము కింది భాగం, పిరుదులు, కాళ్లూ బలపడతాయి. 


సేతుబంధ సర్వాంగాసనం

నేల మీద వెల్లకిలా పడుకుని కాళ్లను మడిచి, పాదాలు నేలకు ఆనించి ఉంచాలి.


నడుమును గాల్లోకి లేపి, రెండు చేతులతో మడమలను పట్టుకోవాలి. 


ఈ భంగిమలో చుబుకం ఛాతీని తాకుతుంది.


పిరుదుల్లో కండరాలు లాగిన అనుభూతి కలగాలి.

Updated Date - 2021-12-28T16:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising