చిన్న చిన్న పనులకే ఎముకలు, నరాలు పట్టేస్తున్నాయా..? అయితే ఇలా చేయండి!
ABN, First Publish Date - 2021-12-14T21:14:27+05:30
శరీరానికి వ్యాయామం కరువైతే చిన్న చిన్న పనులకే ఎముకలు, నరాలు పట్టేస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందులు తొలగాలంటే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఈ యోగాసనాలు సాధన చేయాలి.
ఆంధ్రజ్యోతి(14-12-2021)
శరీరానికి వ్యాయామం కరువైతే చిన్న చిన్న పనులకే ఎముకలు, నరాలు పట్టేస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందులు తొలగాలంటే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఈ యోగాసనాలు సాధన చేయాలి.
ఉత్తనాసనం
ఈ ఆసనం వెన్ను కింది భాగం సాగేలా చేస్తుంది. ఆసనం నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ చేయాలి. పూర్తి ఆసనానికి కనీసం 30 సెకండ్ల నుంచి 3 నిమిషాల సమయం తీసుకోవచ్చు. ఈ ఆసనం ఎలా వేయాలంటే....
కాళ్ల మధ్య అర అడుగు ఎడం ఉండేలా నిలబడి మోకాళ్లను కొద్దిగా వంచి, చేతులు పైకి లేపి, నడుము దగ్గర్నుంచి శరీరాన్ని ముందుకు వంచాలి.
పైకి లేపిన రెండు చేతులు పాదాలను తాకించాలి.
ఇలా చేసే సమయంలో మోకాళ్ల వెనక లాగినట్టు అనిపించడం సహజం. ఈ నొప్పి ఆసనం అలవాటయ్యేకొద్దీ తగ్గుతుంది.
అలాగే ప్రారంభంలో కాళ్లను నిలువుగా ఉంచలేం. కాబట్టి మోకాళ్లు కొద్దిగా వంచి ఆసనం అలవాటు చేసుకోవచ్చు.
బద్ధకోణాసనం
ఈ ఆసనంతో తొడలు, కటి ప్రదేశం, మోకాళ్లు సాగుతాయి. ఆ ప్రదేశాల్లో ఉన్న ఇబ్బందులు తొలగి సంబంధిత అవయవాలను తేలికగా, ఎటువంటి ఆటంకం లేకుండా కదిలించగులగుతారు. ఈ ఆసనం ఎలా వేయాలంటే....
కాళ్లను ఎదురుగా ఉంచి కూర్చోవాలి.
కాళ్లను శరీరానికి దగ్గరగా మడిచి, రెండు పాదాలను సాధ్యమైనంతగా దగ్గరకు చేర్చాలి.
రెండు చేతులతో రెండు పాదాల బొటనవేళ్లను పట్టుకోవాలి.
వెన్ను నిటారుగా ఉంచాలి.
మోకాళ్లను నేలకు తాకించే ప్రయత్నం చేయకూడదు.
తొడలు, పిరుదులు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఫ
Updated Date - 2021-12-14T21:14:27+05:30 IST