ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిజికల్ బ్యాలెన్స్ గాడిలో పడాలంటే..

ABN, First Publish Date - 2021-12-21T19:40:53+05:30

కొన్ని సార్లు శరీరం తూలుతుంది. వేయాలనుకున్న వైపు అడుగు పడదు. ఇందుకు కారణం శరీరంలో సంతులనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-12-2021)

కొన్ని సార్లు శరీరం తూలుతుంది. వేయాలనుకున్న వైపు అడుగు పడదు. ఇందుకు కారణం శరీరంలో సంతులనం లోపించడమే! ఫిజికల్‌ బ్యాలెన్స్‌ గాడిలో పడాలంటే అందుకు తోడ్పడే ఆసనాలను సాధన చేయాలి. 


ప్రసరిత పాదోత్తనాసనం

రెండు కాళ్లూ, రెండు చేతులూ నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో...

వెన్ను సాగుతుంది.

తొడలు, పిక్కలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి.

మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోళన, గందరగోళం, తలనొప్పులు, భుజాల్లో నొప్పులు తగ్గుతాయి

నాడీ వ్యవస్థ స్వాంతన పొందుతుంది.

మరింత క్లిష్టమైన యోగాసనాలను సాధన చేసేందుకు వీలుగా ఈ ఆసనం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.


అధో ముఖ కపోతాసనం

ఒక కాలును మడిచి, మరో కాలును వెనకగా చాపి కూర్చుని, శరీరాన్ని ముందుకు నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో...

వెనకకు వంగే ఆసనాలు వేయడానికి శరీరం సిద్ధమవుతుంది

తుంటి, తొడ ఎముకలు కలిసే కీలు బలపడుతుంది

నడిచేటప్పుడు, పద్మాసనం వేసే సమయంలో, పరిగెత్తే సమయంలో, నిలబడినప్పుడు శరీరం మరింత తేలికగా కదిలేలా ఈ ఆసనం తోడ్పడుతుంది.

Updated Date - 2021-12-21T19:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising