ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్లకు ధరణిలో..నిషేధిత జాబితా తొలగింపు అధికారం

ABN, First Publish Date - 2021-09-07T07:27:02+05:30

పట్టా భూములైనా.. అమ్మలేరు.. కొనలేరు!’ శీర్షికతో ఆంధ్రజ్యోతి సోమవారం నాటి ఎడిషన్‌లో వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘పట్టా భూములైనా.. అమ్మలేరు.. కొనలేరు!’ శీర్షికతో ఆంధ్రజ్యోతి సోమవారం నాటి ఎడిషన్‌లో వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ‘కార్డ్‌’ సాఫ్ట్‌వేర్‌లో నిషేధిత భూముల జాబితాలో ఉన్న స్థలాలను తొలగించే(అన్‌లాక్‌) అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్లు జారీ చేసింది. దీని ప్రకారం కలెక్టర్లు నేరుగా కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లో లాగిన్‌ అయ్యి.. పట్టాభూములు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, వాటిని అన్‌లాక్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. పట్టాభూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం రైతుల పాలిటి శాపంగా మారిందని, పిల్లల పెళ్లిళ్లు, ఇతరత్రా అవసరాలకు తమ భూములను అమ్ముకోలేని దుస్థితి నెలకొందంటూ ఆంధ్రజ్యోతి కథనం ధరణిలోని లోపాలను ఎత్తి చూపిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో వేల మంది రైతులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టర్లు కార్డ్‌లో లాగిన్‌ అయ్యాక.. సంబంధిత భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి.. మండలం, గ్రామం పేర్లను ఎంచుకుని, సర్వేనంబర్‌ ఆధారంగా సంబంధిత రైతుల భూములను అన్‌లాక్‌ చేయవచ్చు. ఇలా ఒకేసారి 50 దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించవచ్చని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల విభాగం (టీఎస్‌టీఎస్‌) అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-09-07T07:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising