ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధు సర్వేలో పాల్గొన్న మంత్రి గంగులదళితబంధు సర్వేలో పాల్గొన్న మంత్రి గంగుల

ABN, First Publish Date - 2021-08-31T05:40:50+05:30

దళితబంధు సర్వేలో పాల్గొన్న మంత్రి గంగులదళితబంధు సర్వేలో పాల్గొన్న మంత్రి గంగుల

హుజూరాబాద్‌లో గద్దెపై కుర్చొని దళితబంధు పథకంపై అవగాహన కల్పిస్తున్న మంత్రి గంగుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, ఆగస్టు 30: హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మక్కపేటలో దళితబంధు సర్వే సోమవారం జరిగింది. ఈ సర్వేను పర్యవేక్షించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శోభమ్మ-బొందయ్య ఇంటికి వెళ్లారు. వారి ఇంటి వద్ద గద్దెపై కూర్చుని దళితబంధు పథకంపై అవగాహన కల్పించారు. 


తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ 


హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సోమవారం మంత్రి గంగుల కమలాకర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంతమందికి నూతనంగా తెల్ల రేషన్‌కార్డులు మంజూరయ్యాయని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. కార్డులను ప్రింట్‌ తీసి లబ్ధిదారులకు సెప్టెంబరు 5తేదీ లోగా బియ్యం పంపిణీ చేయాలని తహసీల్దార్లకు అదేశించారు. కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


సెప్టెంబరు 5న ఆటోనగర్‌ కార్మికులకు పట్టాల పంపిణీ


హుజూరాబాద్‌ పట్టణంలోని ఆటో మొబైల్‌ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి పట్టాలను సెప్టెంబరు 5న మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కేసీఆర్‌ ఆటోనగర్‌ కాలనీ వద్ద అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆటోనగర్‌ అభివృద్ధికి 40 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.


మూన్నూరు కాపులను టీఆర్‌ఎస్‌ నుంచి విడదీయం ఎవరితరం కాదు


హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మున్నూరు కాపు సంఘాల మండలాల అధ్యక్షులు, కార్యదర్శులతో మంత్రి గంగుల కమలాకర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపులను టీఆర్‌ఎస్‌ నుంచి విడదీయడం ఎవరితరం కాదన్నారు. నియోజకవర్గంలో మున్నూరుకాపుల ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మున్నూరు కాపులకు అండగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. 


Updated Date - 2021-08-31T05:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising