మైనర్‌కు స్కూటీ ఇచ్చిన వ్యక్తికి రిమాండ్
ABN, First Publish Date - 2021-03-26T17:13:09+05:30
గత నెల 9న బీహెచ్ఈఎల్ ఆర్అండ్డీలో హోండా యాక్టివాపై...
హైదరాబాద్/బాలానగర్ : గత నెల 9న బీహెచ్ఈఎల్ ఆర్అండ్డీలో హోండా యాక్టివాపై త్రిబుల్ రైడ్ చేస్తూ ముగ్గురు బాలురు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో అభిరూప్ స్కూటీని నడుపుతుండగా వెనకాల కూర్చున్న లోకేష్, రత్నకుమార్ కిందపడ్డారు. రత్నకుమార్ తలకు తీవ్ర గాయమై ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లోకేష్ గాయాలతో బయటపడ్డాడు. మైనర్లకు బైకు ఇచ్చి ప్రమాదానికి కారణమయ్యాడని బీహెచ్ఈఎల్ ఆర్‌అండ్‌డీకి చెందిన అభిరూ్పరెడ్డి తాత రామకృష్ణపై 304-2 ఐపీసీ సెక్షన్ కింది బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రామకృష్ణను రిమాండ్‌కు తరలించారు.
Updated Date - 2021-03-26T17:13:09+05:30 IST