1200 కిలోల ‘సీ కుకుంబర్’ స్వాధీనం
ABN, First Publish Date - 2021-07-07T14:31:22+05:30
అక్రమంగా సరిహద్దులు దాటిపోతున్న ‘సీ కుకుంబర్’ను స్వాధీనం చేసుకున్న కోస్టుగార్డు దళం.. ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి
చెన్నై: అక్రమంగా సరిహద్దులు దాటిపోతున్న ‘సీ కుకుంబర్’ను స్వాధీనం చేసుకున్న కోస్టుగార్డు దళం.. ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా... సముద్రమార్గంలో సీ కుకుంబర్ అక్రమంగా సరిహద్దు దాటుతున్నట్టు అందిన సమాచారం మేరకు కోస్టుగార్డు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి సముద్రంపై సంచరిస్తున్న పడవలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఉదయం 6.30 గంటలకు ఓ పడవలో భారీగా సీ కుకుంబర్‌లు బయల్పడ్డాయి. 110 గోనె సంచుల్లో వున్న ఆ సీ కుకుంబర్లను స్వాధీనం చేసుకున్న కోస్టుగార్డుదళం.. ఆ పడవిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పడవతో సహా మండపం నార్త్ ఫిష్షింగ్ హార్బర్‌కు తీసుకొచ్చిన కోస్టుగార్డు దళం.. వారిని పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
Updated Date - 2021-07-07T14:31:22+05:30 IST