ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 వరకు రాష్ట్రంలోనే ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2021-08-20T17:45:53+05:30

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 25 వరకు రాష్ట్రలోనే గడపనున్నారు. ఈ మేరకు తాజా షెడ్యూల్‌ను ఉపరాష్ట్రపతి కార్యాలయంలో నగరంలో గురువారం విడుదల చేసింది. 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 25 వరకు రాష్ట్రలోనే గడపనున్నారు. ఈ మేరకు తాజా షెడ్యూల్‌ను ఉపరాష్ట్రపతి కార్యాలయంలో నగరంలో గురువారం విడుదల చేసింది. 20న ఉపరాష్ట్రపతి బెంగళూరు రాజ్‌భవన్‌లో జరిగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం మొహర్రం వేడుకల్లో పాలు పంచుకుంటారు. అనంతరం హిందుస్ధాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను ఆయన సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆయన హెచ్‌ఏఎల్‌ వీఐపీ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హుబ్బళ్ళికి చేరుకుంటారు. అదే సాయంత్రం 5-30 గంటలకు ఆయన హంపిలోని తుంగభద్రా డ్యామ్‌కు చేరుకుంటారు. రాత్రి భువనేశ్వరి ప్రభుత్వ గెస్ట్‌హౌ్‌సలో బసచేస్తారు. 21న ఆయన హంపిలోని పలు చారిత్రాత్మక కట్టడాలను, ఆలయాలను సందర్శిస్తారు. 22న  ఆయన రక్షాబంధన్‌, ప్రపంచ  సంస్కృత దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హుబ్బళ్ళి నుంచి ప్రత్యేక విమానంలో అదేరోజు ఉదయం 11-50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం పాఠశాలల విద్యార్ధులతో రక్షాబంధన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి రాజ్‌భవన్‌లోనే బసచేస్తారు. ఇక 23న టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వర్చువల్‌ కార్యక్రమాల్లో రాజ్‌భవన్‌ నుంచే పాలుపంచుకుంటారు. 24న ఆయన రాజ్‌భవన్‌ నుంచే రాజ్‌గురు జయంతి, అరుణ్‌ జెట్లీ వర్ధంతి, వర్చువల్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఉచిత వ్యాక్సిన్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 25న రాజ్‌భవన్‌ నుంచే ఢిల్లీలో జరగుతున్న శివాజీ కళాశాల డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో వర్చువల్‌ ద్వారా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళతారని ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-08-20T17:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising