మూడు పాలికెలలో ప్రశాతంగా పోలింగ్
ABN, First Publish Date - 2021-09-04T18:14:22+05:30
బెళగావి, హుబ్బళ్ళి-ధార్వాడ, కలబుర్గి మహానగర పాలికె ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. వీటితోపాటు వివిధ నగర పాలక, పురపాలక, పట్టణ పంచాయతీలలో ఖాళీ అయినస్థానాలకు ఉప
- ఒకే వార్డులో 1500 ఓట్లు గల్లంతు
బెంగళూరు: బెళగావి, హుబ్బళ్ళి-ధార్వాడ, కలబుర్గి మహానగర పాలికె ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. వీటితోపాటు వివిధ నగర పాలక, పురపాలక, పట్టణ పంచాయతీలలో ఖాళీ అయినస్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా హుబ్బళ్ళిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం జగదీశ్‌శెట్టర్‌తోపాటు కుటుంబీకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెళగావిలోని వార్డు నెంబరు 25 అజంనగర్‌లో 1500మంది ఓట్లు గల్లంతు కావడంతో స్థానికులు మండిపడ్డారు. ఎన్నికలు నిలిపివేయాలని పోలింగ్‌బూత్ వద్ద ఓటర్లు ఆందోళన చేశారు. పోలీసులు, స్థానికులకు వాగ్వాదం జరిగింది. వార్డు ఎన్నికలు కావడంతో వృద్ధులు, మహిళలు క్యూ కట్టి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిచోటా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. హుబ్బళ్ళి-ధార్వాడలో మధ్యాహ్నం దాకా మందకొడిగా పోలింగ్ సాగింది. సాయంత్రం 5గంటలకు 50.39 శాతం పోలింగ్ నమోదైంది. బెళగావి, కలబుర్గిలలోనూ 50శాతానికి పోలింగ్ సాగగా పోలింగ్ ముగిసే సమయానికి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-09-04T18:14:22+05:30 IST