ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాట 33 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేరచరితులే!

ABN, First Publish Date - 2021-03-10T23:16:53+05:30

తమిళనాడులో 33 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేర చరిత్ర ఉన్నవారేనని తేలింది. మొత్తం 204 మంది ఎమ్మెల్యేల్లో 68 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నట్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తమిళనాడులో 33 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేర చరిత్ర ఉన్నవారేనని తేలింది. మొత్తం 204 మంది ఎమ్మెల్యేల్లో 68 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నట్టు ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ (ఏడీఆర్) ఓ నివేదికలో వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాట మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్లో... 38 మంది (19 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. కాగా అసెంబ్లీలోని 157 మంది (77 శాతం) ఎమ్మెల్యేలు తమకు కోట్లలో ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. 89 మంది (44 శాతం) ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి లోపు చదువుకోగా.. 110 (54 శాతం) మంది డిగ్రీ అంతకంటే ఎక్కువగా చదువుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్లోమా హోల్డర్లుగా వున్నట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 78 మంది ఎమ్మెల్యేలు 25 నుంచి 50 సంవత్సరాల లోపు వారుండగా.. 50 నుంచి 70 ఏళ్ల లోపు ఎమ్మెల్యేలు 125 మంది వరకు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వయసు 77 ఏళ్లుగా ఉంది. కాగా తమిళనాట మొత్తం 204 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది (8 శాతం) మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. 

Updated Date - 2021-03-10T23:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising