ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గ్రామానికి ఆహారం అందిస్తా: సోనూసూద్‌

ABN, First Publish Date - 2021-05-02T07:37:06+05:30

అడిగిన వారికి లేదనకుండా సాయపడుతు న్న సోనూసూద్‌ తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. కష్టాల్లో ఉన్న ఆ గ్రామం మొత్తానికి లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ ఆహారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మే 1: అడిగిన వారికి లేదనకుండా సాయపడుతు న్న సోనూసూద్‌ తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. కష్టాల్లో ఉన్న ఆ గ్రామం మొత్తానికి లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ ఆహారం అం దిస్తానని మాటిచ్చారు. ఇటీవలే కొవిడ్‌ నుంచి కోలుకున్న ఈ రియల్‌ హీరో.. ఓ రియాలిటీ టీవీ షోకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పోటీదారుడు ఉదయ్‌ సింగ్‌.. కరోనా వల్ల తమ గ్రామ ప్రజలు కష్టాలు పడుతున్నారని, లాక్‌డౌన్‌తో పనుల్లేక పస్తులుంటున్నారని సోనూ దృష్టికి తీసుకెళ్లాడు. చలించిపోయిన సోనూసూద్‌.. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు ఆ గ్రామానికి ఆహారం అందిస్తానన్నారు.


ఆర్డర్‌ను చైనా అడ్డుకుంటోంది

భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను పంపుతామని చైనా హామీ ఇచ్చింది. కాగా భారత్‌లో కొవిడ్‌ రోగులకు సాయం చేయడానికి తాను ఆర్డర్‌ ఇచ్చిన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను చైనా అడ్డుకుంటోందని రియల్‌ హీరో సోనూసూద్‌ ఇంతకుముందు ట్విటర్‌లో ఆరోపించారు. దీంతో చైనా వెంటనే సోనూ ఆరోపణపై స్పందించింది. ‘‘ట్విటర్‌లో మీ (సోనూ) ఆరోపణను చూశాం. భారత్‌కు మా శక్తికొద్దీ సాయం చేస్తాం.’’ అని చైనా తెలిపింది.


Updated Date - 2021-05-02T07:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising