ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఏఐఏడీఎంకే

ABN, First Publish Date - 2021-01-09T23:41:45+05:30

తమిళనాడు శాసన సభ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరగనున్నతరుణంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడు శాసన సభ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరగనున్నతరుణంలో బీజేపీకి ఏఐఏడీఎంకే గట్టి సందేశాన్ని పంపించింది. శనివారం జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల పొత్తులపై నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించలేదు. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలకు అప్పగించింది. 


ఓ పన్నీర్‌సెల్వం ఏఐఏడీఎంకే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎడపాడి కే పళనిస్వామి ఆ పార్టీ జాయింట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఇటీవల బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఓ కార్యక్రమంలో ఇరువురు నేతలు ప్రకటించిన ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కొనసాగుతుందో, లేదో స్పష్టంగా చెప్పే తీర్మానమేదీ శనివారం చేయలేదు. 


తమిళనాడులో అధికార పంపిణీ డిమాండ్ల గురించి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఏఐఏడీఎంకే ఎంపీ, సీనియర్ నేత మునుస్వామి శనివారం మాట్లాడుతూ, తమిళనాడులో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం లేదన్నారు. ‘అమ్మ’ జయలలిత స్నేహితురాలు శశికళ జైలు నుంచి విడుదలైనప్పటికీ ఏఐఏడీఎంకేపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. ఆమెకు అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. 


Updated Date - 2021-01-09T23:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising