ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ చేసిన ప్రార్థనలే కాపాడాయి

ABN, First Publish Date - 2021-04-18T07:20:08+05:30

తాను నక్సల్స్‌ చెరలో బందీగా ఉన్నప్పుడు.. తన తల్లి చేసిన ప్రార్థనలు, క్షేమంగా తిరిగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌

జమ్మూ, ఏప్రిల్‌ 17: తాను నక్సల్స్‌ చెరలో బందీగా ఉన్నప్పుడు.. తన తల్లి చేసిన ప్రార్థనలు, క్షేమంగా తిరిగి రావాలనే దేశ ప్రజల ఆకాంక్షే తనను కాపాడాయని కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ పేర్కొన్నారు. ఈ నెల 3న ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తెర్రాం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. మావోయిస్టులు రాకేశ్వర్‌ను అపహరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న అతడిని ప్రజాకోర్టులో క్షేమంగా విడుదల చేశారు. ఆ తర్వాత వారం రోజులపాటు సీఆర్పీఎఫ్‌ యూనిట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రాకేశ్వర్‌.. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని తన స్వగ్రామం బార్నజేకు చేరుకున్నారు. గ్రామస్థులంతా రాకేశ్‌కు బ్రహ్మరథం పట్టారు. 


ఈ సందర్భంగా రాకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఐదు రోజులు నక్సల్స్‌ చెరలో ఉన్నా.. ఎక్కడా నమ్మకాన్ని కోల్పోలేదు. కానీ, నక్సల్స్‌ అపహరించిన ఒక జవాను క్షేమంగా తిరిగి రావడం ఇదే మొదటిసారి. నా తల్లి చేసిన ప్రార్థనలు, నా క్షేమాన్ని కోరుకున్న దేశ ప్రజల అభిమానమే నన్ను కాపాడాయి’’ అని అన్నారు.  


Updated Date - 2021-04-18T07:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising