ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బాలికా వధు’ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం

ABN, First Publish Date - 2021-09-03T07:36:23+05:30

హిందీ టీవీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా (40) గురువారం హఠాన్మరణం చెందారు. బాలికా వధు సీరియల్‌తో అభిమానులను సంపాదించుకున్న శుక్లా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, సెప్టెంబరు 2: హిందీ టీవీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా (40) గురువారం హఠాన్మరణం చెందారు. బాలికా వధు సీరియల్‌తో అభిమానులను సంపాదించుకున్న శుక్లా బుధవారం రాత్రి నిద్రపోయే ముందు కొన్ని మందులు వేసుకున్నారని, గురువారం ఉదయం ఎంతకూ నిద్ర లేవలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. జూహూలోని కూపర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన కన్నుమూశారని సమాచారం. తీవ్ర గుండెపోటు వల్లే శుక్లా మరణించారని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. ఆయనకు తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించిన సిద్ధార్థ్‌, బాలికా వధుతో పాటు పలు హిందీ సీరియళ్లు, సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. గత ఏడాది బిగ్‌బా్‌సలోనూ గెలిచారు.


Updated Date - 2021-09-03T07:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising