ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం

ABN, First Publish Date - 2021-01-26T03:20:14+05:30

పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని తృణమూల్ కాంగ్రెస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఈ వివాదాస్పద చట్టాలను వెంటనే కొట్టివేయాలని తీర్మానం చేయనున్నట్టు సీనియర్ మంత్రి ఒకరు వెల్లడించారు. ‘‘ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 169 నిబంధన కింద ఈ నెల 28న తీర్మానం ప్రవేశపెడతాం..’’ అని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ వెల్లడించారు. ఈ తీర్మానంపై రెండున్నర గంటల పాటు చర్చ జరుగుతుందన్నారు. కాగా ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాలైన పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు తీర్మానాలు ఆమోదించాయి. 


Updated Date - 2021-01-26T03:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising