ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించిన శివసేన

ABN, First Publish Date - 2021-05-26T21:55:37+05:30

కొద్ది రోజుల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగినంత ప్రభావం చూపలేకపోయింది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీకి చేరువలో ఆగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశంలో కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఆవైపు ఏమాత్రం ఆలోచన లేదని, ఆ పార్టీ నేతల ఆలోచనంతా ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించేనని శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. బుధవారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై దుమ్మెత్తి పోసింది.


‘‘పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోగానే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉత్తరప్రదేశ్ వైపు చూపు కదిలించింది. మోదీ, అమిత్ షా, యోగి ఈ విషయమై రహస్య సమావేశవేశం నిర్వహించారు. దేశం మొత్తం కొవిడ్‌తో పోరాడుతుంటే బీజేపీ మాత్రం ఎన్నికలు నిర్వహించడం, భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టడం, రోడ్‌షోలు నిర్వహించడం, ఎన్నికల్లో గెలవడం మీదే దృష్టి పెడుతోంది’’ అని సామ్నా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.


కొద్ది రోజుల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగినంత ప్రభావం చూపలేకపోయింది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీకి చేరువలో ఆగిపోయింది. ఈ నేపధ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే కొవిడ్ నేపధ్యంలో కొద్ది రోజుల క్రితం ఐదు అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించి తీవ్ర విమర్శలకు గురైంది ఎన్నికల సంఘం. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చందనే విమర్శలు కూడా వచ్చాయి.

Updated Date - 2021-05-26T21:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising