ప్రభుత్వ కార్యాలయంలో పేలిన బాంబ్.. నేపాల్‌లో..
ABN, First Publish Date - 2021-03-15T09:56:12+05:30
నేపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ పేలిన ఘటన కలకలం సృష్టిస్తోంది. అధికారులు తెలిపిన వివ
ఖాత్మండు: నేపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ పేలిన ఘటన కలకలం సృష్టిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరాహ జిల్లాలోని ల్యాండ్ రివెన్యూ ఆఫీసులో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రెషర్ కుక్కర్ బాంబ్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ఉద్యోగులకు తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఐదుగురు మగవారు, ముగ్గురు ఆడవారు గాయాలపాలైనట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనకు పాల్పడింది జయతాంత్రిక్ తారై ముక్తి మోర్చా అని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఈ సంస్థకు చెందిన పాంప్లెట్లు లభించినట్టు చెప్పారు. అయితే ఆ పాంప్లెట్లలో ఏం రాసిందీ అర్థం కావడం లేదన్నారు. ప్రజల రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం జయతాంత్రిక్ తారై ముక్తి మోర్చా అనే సంస్థ ఏర్పాటైంది. జయ కృష్ణ గోయిట్ అనే వ్యక్తి ఈ సంస్థను నడుపుతున్నాడు.
Updated Date - 2021-03-15T09:56:12+05:30 IST