ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నికలకు వేళాయె!

ABN, First Publish Date - 2021-09-29T07:14:21+05:30

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. మూడు లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ మంగళవారం ఒకేసారి షెడ్యూలు ప్రకటించింది. వీటన్నిటికీ అక్టోబరు 30న ఎన్నిక జరుగుతుంది. నవంబరు రెండో తేదీన ఓట్లు లెక్కిస్తారు.


షెడ్యూలు విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని హుజూరాబాద్‌; ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు కూడా ఉన్నాయి. వీటితోపాటు అసోంలో 5, బిహార్‌లో 2, హిమాచల్‌ ప్రదేశ్‌లో 3, కర్ణాటకలో 2, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, రాజస్థాన్‌లో 2, పశ్చిమ బెంగాల్‌లో 4, హరియాణ, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఒకటి చొప్పున అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఇక, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా; హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి; దాద్రా నగర్‌ హవేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. గత నెలలో జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది.


భవానీపూర్‌ ఉప ఎన్నికకు ఓకే

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌ ఉప ఎన్నికకు కలకత్తా హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈసీ నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఉప ఎన్నికను నిలుపుదల చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలని కోరుతూ  వచ్చిన పిటిషన్‌పై నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఉప ఎన్నికను త్వరగా నిర్వహించాలంటూ ఈసీకి లేఖ రాసిన సీఎస్‌ హెచ్‌.కె.ద్వివేదిని మందలించింది. ఒక రాజకీయ పార్టీకి సేవకుడిగా సీఎస్‌ వ్యహరించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.


కాగా, భవానీపూర్‌ ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం జరగకుండా చూడాలంటూ బీజేపీ ప్రతినిధులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు, బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టు..కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.


Updated Date - 2021-09-29T07:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising