ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెహుల్ చోక్సీ ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ సాయం కోరనున్న సీబీఐ

ABN, First Publish Date - 2021-05-25T18:59:09+05:30

బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆచూకీ తెలియడం లేదన్న వార్తలపై సీబీఐ అప్రమత్తమైంది. కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా-బార్బుడా దేశంలో ఉంటున్న ఆయన ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. క్యూబా పారిపోయి ఉండొచ్చనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. దీనిపై భారత్‌లోని ఆంటిగ్వా ఎంబసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్టు సీబీఐ వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి. నిజానిజాలను నిర్దారణ చేసుకునేందుకు దౌత్యవర్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పాయి. చోక్సీ ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమని అధికారలు తెలిపారు. దౌత్య వర్గాలు, విదేశాంగ శాఖ ద్వారా తొలుత ధ్రువీకరరణ చేసుకుని ఆ త్వరాత ఇంటర్నేషనల్ డెస్క్‌ను అప్రమత్తం చేస్తామని చెప్పారు. ఆయన ఆచూకీ తెలియడం లేదన్నదే నిజమైతే ఇంటర్‌పోల్ ద్వారా ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నం చేస్తుందని ఆ వర్గాలు చెప్పాయి.


మెహుల్ చోక్సీ కనిపిచడం లేదని, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన భద్రతపై ఆందోళనతో ఉన్నారని చోక్సీ లాయర్ ప్రకటించడంతో ఈ విషయం సంచలనమైంది. ఆదివారం సాయంత్రం ఓ రెస్టారెంట్‌లో విందుకు చోక్సీ వెళ్లినట్టు ఆంటిగ్వా మీడియా కథనాలు పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఆయన కారును జాలీ హార్బర్ సమీపంలో పోలీసులు గుర్తించారని, అందులో ఆయన లేకపోవడంతో గాలింపు చేపట్టారని ఆ కథనలు చెబుతున్నాయి. జాలీ హార్బర్ నుంచి ఆయన సముద్ర మార్గంలో క్యూబా వెళ్లి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గీతాంజలి జ్యూయలర్స్ యజమాని అయిన మెహుల్  చోక్సీ భారత్‌లో రూ.13,000 కోట్ల మేరకు ఆర్థిక మోసానికి పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. పరారీలో ఉన్న అతనిపై సీబీఐ పలు కేసులు నమోదు కూడా చేసింది. ఇండియాకు అప్పగించాలంటూ లీగల్ బ్యాటిల్ కూడా చేస్తోంది.

Updated Date - 2021-05-25T18:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising