ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చండీగఢ్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ హవా

ABN, First Publish Date - 2021-12-28T06:26:33+05:30

పంజాబ్‌, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అత్యధిక....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీ..

పంజాబ్‌లో మార్పునకు సంకేతాలు: కేజ్రీ

మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు


చండీగఢ్‌, డిసెంబరు 27: పంజాబ్‌, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను 2, 3 స్థానాలకు నెట్టివేసింది. శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలను  రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.


మొత్తం 35 స్థానాల్లో ఆప్‌ 14 స్థానాలో విజయం సాధించగా, బీజేపీ 12 స్థానాలను, కాంగ్రెస్‌ 8, అకాలీదళ్‌ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ దెబ్బతగిలింది. ఆ పార్టీ అభ్యర్థులు మేయర్‌ రవికాంత్‌ శర్మ, మాజీ మేయర్‌ దవేష్‌ మౌద్గిల్‌ ఇద్దరూ ఓడిపోయారు. చండీగఢ్‌ ఫలితాలు పంజాబ్‌లో తక్షణ మార్పును సూచిస్తున్నాయని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అవినీతి రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. పంజాబ్‌ మార్పుకు సిద్ధంగా ఉందని చెప్పారు. 


పంజాబ్‌లో అమరీందర్‌, ధిండ్సా పార్టీలతో కలిసి బీజేపీ పోటీ

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అమరీందర్‌ సింగ్‌ పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రె్‌స(పీఎల్‌సీ), సుఖదేవ్‌సింగ్‌ ధిండ్సా పార్టీ శిరోమణి అకాలీదళ్‌(సంయుక్త)లతో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ చెప్పారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యూహం రూపొందించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నివాసంలో షా,  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఆ పార్టీ అగ్రనాయకులు, అమరేంద్రసింగ్‌, ధిండ్సా సోమవారం సమావేశమయ్యారు.


మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని  నిర్ణయించినట్లు సమావేశం అనంతరం బీజేపీ పంజాబ్‌ ఎన్నికల ఇన్‌చార్జి అయిన  షెకావత్‌ చెప్పారు. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌(ఎ్‌సఏడీ), ఆమ్‌ఆద్మీపార్టీ(ఆ్‌ప)లతోపాటు వివిధ రైతు సంఘాలు కూడా పోటీచేసే అవకాశం ఉన్నందున పంజాబ్‌లో పంచముఖ పోటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత అమరీందర్‌ పీఎల్‌సీ పార్టీ పెట్టారు. 

Updated Date - 2021-12-28T06:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising