ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ చైనా వర్సిటీల ఒత్తిళ్ళు

ABN, First Publish Date - 2021-07-21T20:28:38+05:30

చైనా విశ్వవిద్యాలయాల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చైనా విశ్వవిద్యాలయాల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం నిషేధించిన చైనీస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ తమ వద్ద చదువుకుంటున్న విద్యార్థులను నిర్బంధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 23 వేల మంది విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 


చైనాలోని హర్బిన్ మెడికల్ యూనివర్సిటీ, సూచౌ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు దాదాపు 23,000 మంది ఉన్నారు. వీరిలో సుమారు 20 వేల మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. భారత ప్రభుత్వం దాదాపు 250 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించింది. కోర్సులను కొనసాగించాలంటే ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవలసిందేనని విశ్వవిద్యాలయాలు పట్టుబడుతున్నాయని విద్యార్థులు తెలిపారు. చైనాలోని అత్యధిక విశ్వవిద్యాలయాలు వుయ్‌చాట్, డింగ్‌టాక్, సూపర్‌స్టార్, టెన్సెంట్ వీడియో చాట్ యాప్‌లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, చదువులు కొనసాగించాలని చెప్తున్నాయని తెలిపారు. 


ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ చైనా (ఐఎస్‌సీ)లో సభ్యులమైన తాము తమ సమస్యను భారత్, చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. తాత్కాలిక పరిష్కారంగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా ఈ యాప్‌లను ఉపయోగిస్తూ, తరగతులకు హాజరవుతున్నామన్నారు. 


Updated Date - 2021-07-21T20:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising