ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య నుంచి బరిలోకి దిగనున్న Cm yogi

ABN, First Publish Date - 2021-07-25T19:13:43+05:30

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... బీజేపీ తన పట్టును తిరిగి నిలుపుకోడానికి సంచల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... బీజేపీ తన పట్టును తిరిగి నిలుపుకోడానికి సంచల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన శాసన మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన  పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం యోగిని ఈసారి అయోధ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అయోధ్య నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదప్రకాశ్ గుప్త సీఎం యోగి కోసం ఈ సీటును త్యాగం చేయనున్నారు. ఇందుకు ఆయన సంతోషకరంగా అంగీకరించారు. సీఎంతో పాటు పాటు ఇతర కీలక నేతలైన డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ లక్నో పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు సీఎం యోగిని ఈసారి ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం చర్చోపచర్చలు చేసినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం పెద్దలు ఇదే విషయంపై కొన్ని రోజుల పాటు మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-07-25T19:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising