ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు పార్టీల వల్లే దేశానికి ఈ గతి పట్టింది: మాయావతి

ABN, First Publish Date - 2021-01-26T22:23:28+05:30

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లపై బీఎస్పీ చీఫ్ మాయావతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లపై బీఎస్పీ చీఫ్ మాయావతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు తమ ‘‘ప్రజాస్వామ్య విధులను’’ సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇవాళ దేశంలో పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం లాంటి సమస్యలు ఉండేవి కాదని ఆమె అన్నారు. ‘‘ఎప్పటి మాదిరిగానే గణంతంత్ర దినోత్సవం నాడు వేడుకలు చేసుకునే బదులు... ఇప్పటి వరకు పేదలు, రైతులు, కష్టపడి పనిచేస్తున్న కార్మికులు ఏం కోల్పోయారనే దానిపై విశ్లేషణ జరగాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుంచి మన దేశ చరిత్రను పరిశీలించి చూస్తే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు రెండూ పార్టీలూ తమ ప్రజాస్వామ్య విధులను విస్మరించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. లేకుంటే ఎందుకు దేశం ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, వెనుబాటుతాలను ఎదుర్కొంటోంది?..’’ అని మాయావతి తన ప్రసంగంలో ప్రశ్నించారు.


మానవతా దృక్పథంతో కూడిన రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినందుకు దేశం యావత్తూ బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేద్కర్‌కు రుణపడి ఉంటుందనీ.. అయితే ఆయన సమానత్వం సిద్ధాంతం, సూత్రాలు సమర్థంగా అమలు కాకపోవడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని మాయవతి అన్నారు. ‘‘ఓ వైపు దేశంలోని సామాన్య ప్రజలు కష్టించి పనిచేస్తున్నప్పటికీ వారికి కనీస వసతులు కూడా అందడం లేదు. మొత్తం సొమ్ము పెట్టుబడిదారులే లాగేసుకుంటున్నారు. దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళనకరం..’’ అని ఆమె అన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కారణంగా ఈ సారి ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ‘‘కొత్తగా కనిపిస్తున్నాయని’’ ఆమె అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ.. ఇకపై ఏదైనా చట్టం చేస్తే రైతులను సంప్రదించాలని తాను కోరుతున్నానన్నారు. ‘‘ప్రభుత్వం ఈ సలహాను స్వీకరించి ఉంటే ‘కొత్తరకం’ రిపబ్లిక్ డే వేడుకలు జరిగేవి కాదు..’’ అని మాయావతి పేర్కొన్నారు.

Updated Date - 2021-01-26T22:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising