ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ మాటంటే మాటే

ABN, First Publish Date - 2021-10-31T08:03:04+05:30

కాంగ్రెస్‌ ఏదైనా హామీ ఇచ్చిందంటే దానిని కచ్చితంగా నెరవేర్చి తీరుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో హామీని చేర్చిందంటే దాని అమలుపై గ్యారంటీ ఇచ్చినట్లేనన్నారు. విశ్వసనీయతకు కాంగ్రెస్‌ పెద్దపీట వేస్తుందని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మేనిఫెస్టోలో హామీలంటే గ్యారంటీ ఇచ్చినట్లే : రాహుల్‌గాంధీ


పనాజి, అక్టోబరు30: కాంగ్రెస్‌ ఏదైనా హామీ ఇచ్చిందంటే దానిని కచ్చితంగా నెరవేర్చి తీరుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో హామీని చేర్చిందంటే దాని అమలుపై గ్యారంటీ ఇచ్చినట్లేనన్నారు. విశ్వసనీయతకు కాంగ్రెస్‌ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని చెప్పామని, అధికారంలోకి రాగానే రద్దు చేశామని గుర్తు చేశారు. పంజాబ్‌, కర్ణాటకల్లోనూ తమ హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో శనివారం రాహుల్‌గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా దక్షిణ గోవాకు చెందిన మత్స్యకార వర్గం ప్రజలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలతో చర్చించి తమ మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. ప్రధానంగా గోవాలో పర్యావరణాన్ని పరిరక్షించడంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. 


 మత్స్యకారులతో సమావేశం అనంతరం బంబోలిమ్‌ గ్రామంంలో రోడ్డు పక్కనే రాహుల్‌గాంధీ మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తరువాత మైనింగ్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికులతో సమావేశమయ్యేందుకుగాను అక్కడినుంచి రిసార్టుకు వెళ్లేందుకు రాహుల్‌గాంధీ ఓ బైక్‌పై కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు.  

Updated Date - 2021-10-31T08:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising