ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ, ఢిల్లీల‌తో పాటు 10 రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం!

ABN, First Publish Date - 2021-05-18T13:37:55+05:30

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కాస్త  త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. దేశంలో కొత్తగా న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌ త‌గ్గుతోంది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా  త‌గ్గుతోంది. అయితే క‌రోనా మృతుల సంఖ్య‌లో మార్పులేదు. గత కొన్ని రోజులుగా దేశంలో క‌రోనాతో నాలుగు వేలకు పైగా బాధితులు మృతి చెందుతున్నారు. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం విశేషం. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ హర్యానా ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరాఖండ్‌తో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఆందోళనక‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. వీటిలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, అసోం, ఒడిశా, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉన్నాయి. కర్ణాటకలోని 27 జిల్లాల్లో క‌రోనా వ్యాప్తి రేటు 20 శాతానికి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని 38 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్ రేటు 10 శాతానికి పైగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 2.11 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో రికవరీ రేటు మళ్లీ 84.81 శాతానికి చేరింది. 

Updated Date - 2021-05-18T13:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising