ప్రచారంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన
ABN, First Publish Date - 2021-09-30T14:30:21+05:30
స్థానిక ఎన్నికల ప్రచారంలో నేతలు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించక పోవ డంతో కరోనా ప్రబలే ప్రమాద ముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేలూరు, రాణిపేట, తిరుప్తూర్
వేలూరు(చెన్నై): స్థానిక ఎన్నికల ప్రచారంలో నేతలు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించక పోవ డంతో కరోనా ప్రబలే ప్రమాద ముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేలూరు, రాణిపేట, తిరుప్తూర్ జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికలను పురస్కరించుకొని ప్రచారం ఊపందుకుంది. పలు పార్టీలు ప్రచారం కోసం భారీగా జనాన్ని తరలిస్తుండగా, వారు మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలాంటి చర్యలతో మళ్లీ జిల్లాల్లో కరోనా ప్రబలే అవకాశ ముందని, అధికారులు దీనిపై స్పందించి ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా పర్యవేక్షిం చాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2021-09-30T14:30:21+05:30 IST