ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేకే శైలజను తప్పించడంపై సీపీఎంపై విమర్శలు

ABN, First Publish Date - 2021-05-18T22:55:10+05:30

శైలజకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈసారి కూడా హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న వారికి ఈ వార్త మింగుడుపడటం లేదు. దీనిపై ఎల్డీఎఫ్ నేతలు స్పందించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) ఆధ్వర్యంలో వరుసగా రెండవసారి ఏర్పాటైన ప్రభుత్వంలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకేశైలజకు చోటు దక్కకపోవడంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఏఎం) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శైలజా టీచర్‌గా కేరళ ప్రజల హృదయాల్లో చోటుదక్కించుకున్న ఆమె.. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. అంతేగాక గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనా ఫస్ట్ వేవ్ అలాగే, నిఫా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ‘రాక్‌స్టార్’ హెల్త్ మినిస్టర్‌గా పేరొందారు. యూకే నుంచి వెలువడే మ్యాగజైన్‌ ఒకటి.. ఆమెను ‘టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020’గా ఎంపిక చేసింది.


శైలజకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈసారి కూడా హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న వారికి ఈ వార్త మింగుడుపడటం లేదు. దీనిపై ఎల్డీఎఫ్ నేతలు స్పందించారు. యువతరాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, పూర్తిగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే పార్టీ నేతలు ఇస్తున్న వివరణలు సరిపోవడం లేదు. శైలజా టీచర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెటిజెన్లు హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఈ విషయమై స్పందిస్తూ ‘‘సహాయక దృక్పథం, సమాజిక బాధ్యత, కష్టపడేతత్వం ఆమెలో నేను చూశాను. కానీ ఆమె ప్రస్తుత మంత్రివర్గంలో లేకపోవడం బాధాకరం’’ అని ట్వీట్ చేశారు. సీపీఎం నిర్ణయం తమకు ఆశ్చర్యానికి గురి చేసిందని, కేకే శైలజను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం బాధాకరమని నెటిజెన్లు అంటున్నారు.

Updated Date - 2021-05-18T22:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising