ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబూల్ ఉగ్రదాడి.. 103కు పెరిగిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2021-08-27T21:57:47+05:30

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నిన్న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నిన్న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 103కు పెరిగింది. అలాగే, 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది మెరైన్స్, ఓ నేవీ మెడికల్ అధికారి సహా 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అలాగే మరో 18 మంది గాయపడ్డారు. కాబూల్ ఉగ్రదాడికి కారణం తామేనని ఆఫ్ఘన్ అనుబంధ ఇస్లామిక్ స్టేట్ -ఐసిస్ ఖోరాసన్ (ఐసిస్-కె) ప్రకటించింది.  ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఫొటోను ఐఎస్ విడుదల చేసింది. పెద్ద ఎత్తున గుమిగూడిన జనాన్ని దాటుకుని కాబూల్ విమానాశ్రయం సమీపంలోని ‘బరాన్ క్యాంప్’ దగ్గరకు చేరుకున్న ఉగ్రవాది ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో నిన్న 72 మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు ఆ తర్వాత మరణించారు. దీంతో మృతుల సంఖ్య 103కు పెరిగింది. మృతుల్లో తాలిబన్ ఫైటర్లు కూడా ఉండడం గమనార్హం.  

Updated Date - 2021-08-27T21:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising