ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిషీల్డ్‌ రెండు డోసులిచ్చినా.. ‘డెల్టా’ యాంటీబాడీలు రాలే!

ABN, First Publish Date - 2021-07-05T07:27:22+05:30

ఆందోళన రేకెత్తిస్తున్న డెల్టా కరోనా వేరియంట్‌పై కొవిషీల్డ్‌ టీకా ఎంతమేర పనిచేస్తోంది ? యాంటీబాడీల విడుదల ఏ స్థాయిలో జరుగుతోంది ? అనేది తెలుసుకునేందుకు భారత వైద్య పరిశోధనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16 శాతం మందిలో లేవ్‌

ఒక్క డోసు తీసుకున్న 58.1 శాతం మందిలో కనిపించని ప్రతిరక్షకాలు 


న్యూఢిల్లీ, జూలై 4 : ఆందోళన రేకెత్తిస్తున్న డెల్టా కరోనా వేరియంట్‌పై కొవిషీల్డ్‌ టీకా ఎంతమేర పనిచేస్తోంది ? యాంటీబాడీల విడుదల ఏ స్థాయిలో జరుగుతోంది ? అనేది తెలుసుకునేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇందులో భాగంగా టీకా ఇచ్చిన పలువురి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. ఒకే డోసును అందించిన వారిలో 58.1 శాతం మందిలో, రెండు డోసులిచ్చిన వారిలో 16.1 శాతం మందిలో డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు కానరాలేదని ఐసీఎంఆర్‌ సెంటర్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ మాజీ డైరెక్టర్‌ టి.జాకబ్‌ జాన్‌ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో బ్రిటన్‌ వేరియంట్‌ (బీ1)కు సంబంధించిన యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలోనే విడుదలయ్యాయన్నారు.


కొవిడ్‌ నుంచి కోలుకున్న వారికి కొవిషీల్డ్‌ టీకా సింగిల్‌ డోసుతోనే డెల్టా వేరియంట్‌ నుంచి బలమైన రక్షణ లభిస్తోందని పేర్కొన్నారు.  కాగా, 2025 సంవత్సరంకల్లా క్షయ (టీబీ) వ్యాధిని నిర్మూలించాలని భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి కరోనా ఆరోగ్య సంక్షోభం ఆటంకాలను సృష్టిస్తోందని ఐసీఎంఆర్‌ పేర్కొంది. వైద్యరంగ వనరులను అన్నింటిని కరోనా కట్టడి చర్యలకు మోహరించిన ప్రస్తుత తరుణంలో.. టీబీకి కళ్లెం వేసే చర్యలపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశం లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తంచేసింది.

Updated Date - 2021-07-05T07:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising