చెంచాతో సొరంగం తవ్వి.. ఇజ్రాయెల్ జైలు నుంచి ఖైదీల పరారీ
ABN, First Publish Date - 2021-09-08T07:27:31+05:30
భద్రతకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. ఇక ఆ దేశంలోని జైళ్లలో అధునాతన నిఘాతో పటిష్ఠ భద్రత కొనసాగుతుంది. అలాంటి ఓ జైలులో తుప్పుపట్టిన చెంచాతో సొరంగాన్ని తవ్విన ఓ సాధారణ ఖైదీ సహా......
జెరూసలెం, సెప్టెంబరు 7: భద్రతకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. ఇక ఆ దేశంలోని జైళ్లలో అధునాతన నిఘాతో పటిష్ఠ భద్రత కొనసాగుతుంది. అలాంటి ఓ జైలులో తుప్పుపట్టిన చెంచాతో సొరంగాన్ని తవ్విన ఓ సాధారణ ఖైదీ సహా.. ఐదుగురు ఇస్లామిక్ జిహాదీలు పరారయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ జైళ్ల శాఖ కమిషనర్ కేటీ పెర్రీ నిర్ధారించారు. పారిపోయిన వారంతా ఒకే సెల్‌లో ఉండేవారని, ఆ సెల్‌లో ఉన్న సింక్ కిందిభాగంలో సొరంగం తవ్వారని ఆయన వివరించారు. సెల్ నుంచి కొంత దూరం సొరంగం తవ్వారని, జైలు గోడల వెనుక భాగం నుంచి పరారయ్యారని పేర్కొన్నారు. నిందితులు జెనిస్ వైపు పారిపోయి ఉంటారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ముందుజాగ్రత్తగా 400 మంది ఖైదీలను వేరే జైలుకు తరలించామన్నారు.
Updated Date - 2021-09-08T07:27:31+05:30 IST