ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర మాజీ Home Minister అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-02T12:33:55+05:30

మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై :మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 12 గంటలకు పైగా విచారించింది. విచారణ తర్వాత అతన్ని అరెస్టు చేసి మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చింది. అనిల్ ను ఈడీ కస్టడీ రిమాండ్‌ కోరనుంది.ఈడీ విచారణకు హాజరు కావాలని కోరుతూ పలు సమన్లు జారీ చేసినా అనిల్ దాటవేశారు. ఎట్టకేలకు దర్యాప్తు అధికారుల ముందు హాజరైన అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించే సమయంలో సహకారం అందించని కారణంగా అతన్ని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు.అరెస్టుకు ముందు మాజీ మంత్రి స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. 


రూ.100 కోట్ల అక్రమాల రాకెట్ కు సంబంధించి అనిల్ దేశ్ ముఖ్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ విచారణ జరుపుతోంది.ముంబైలోని హోటళ్లు, బార్‌ల నుంచి ప్రతి నెలా రూ. 100 కోట్లు వసూలు చేయమని తొలగింపునకు గురైన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజ్‌ను అనిల్ దేశ్‌ముఖ్ అడిగారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు.ముంబైలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వెలుపల ఈ ఏడాది ఫిబ్రవరి 25న పేలుడు పదార్థంతో కూడిన వాహనం కనిపించడంతో మొత్తం వివాదం బయటపడింది. దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సచిన్ వాజే ప్రమేయాన్ని గుర్తించింది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పరంబీర్ సింగ్‌ను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తొలగించింది.పరంబీర్ సింగ్ ఆరోపణల తర్వాత బాంబే హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఆదేశించింది.అప్పట్లో మహారాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు.


Updated Date - 2021-11-02T12:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising