ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌తో 36 కోట్ల మందిలో సమస్యలు

ABN, First Publish Date - 2021-11-09T07:29:03+05:30

ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లో 36 కోట్ల మందికిపైగా ఈ ఫ్లాట్‌ఫామ్‌ వినియోగం సమస్యాత్మకంగా ఉందని ధ్వజమెత్తారని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయినా పట్టించుకోని సంస్థ: వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ 


న్యూఢిల్లీ, నవంబరు 8: ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లో 36 కోట్ల మందికిపైగా ఈ ఫ్లాట్‌ఫామ్‌ వినియోగం సమస్యాత్మకంగా ఉందని ధ్వజమెత్తారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఈ యాప్‌ను వినియోగించడం వలన బలవంతపు ప్రభావాన్ని చవిచూశారని వెల్లడించింది. ఈ యాప్‌ వినియోగం వలన అనేకమంది పిల్లల పెంపకం, మానవ సంబంధాలు, నిద్ర, పని వంటి విషయాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదు చేశారని తెలిపింది. ఫేస్‌బుక్‌ స్వయంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఈ ఆప్‌కు బానిసగా మారిన వారిలో ఈ సమస్యలు స్పష్టంగా కనిపించాయని ఫేస్‌బుక్‌ తన సర్వేలో గుర్తించిందని చెప్పింది.  ఈ దుష్ప్రభావాలను అంచనా వేయడానికి కొన్నేళ్ల క్రితమే ఫేస్‌బుక్‌ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారుల సమస్యలను గుర్తించిన ఈ బృందం కొన్ని సూచనలు చేసింది. కానీ.. ఈ సమస్యలకు పరిష్కారం చూపించకుండానే 2019లో ఫేస్‌బుక్‌ ఈ టీమ్‌ను రద్దు చేసింది. ఫ్రాన్సిస్‌ హాగెన్‌ అనే ఆమె ఫేస్‌బుక్‌ అంతర్గత పత్రాలను ‘ఫేస్‌బుక్‌ ఫైల్స్‌ సిరీస్‌’ పేరిట లీక్‌ చేయడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి.

Updated Date - 2021-11-09T07:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising