సీఎం పర్యటనలో రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2021-05-17T02:05:24+05:30
సీఎం పర్యటనలో రైతుల ఆందోళన
హర్యానా సీఎం హిసార్ లో పర్యటనకు వెళ్లగా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రైతులు పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీఎం పర్యటన సందర్భంగా హర్యానా హిసార్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారు. రైతులను పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. కోవిడ్ -19 రోగుల కోసం 500 పడకల ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించడానికి సీఎం వచ్చారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించారు. ఈ ఘర్షణలో డీఎస్పీతో సహా పలువురు రైతులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
Updated Date - 2021-05-17T02:05:24+05:30 IST