ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ వాసులందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్.. బడ్జెట్‌లో రూ.50 కోట్లు

ABN, First Publish Date - 2021-03-09T18:22:52+05:30

అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారంనాడు కీలక ప్రకటన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారంనాడు కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ వాసులందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం 2021-2022 బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ప్రకటన చేశారు. రోజుకు ఇస్తున్న 45,000 వ్యాక్సిన్లను త్వరలోనే 60,000కు చేర్చనున్నట్టు చెప్పారు.


ఢిల్లీలో ప్రస్తుతం 192 ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఇందులో 56 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి, వివిధ రుగ్మలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులకు మూడో ఫేజ్‌లో ఉచిత వ్యాక్సిన్ కోసం నిధులు కేటాయించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వయోవృద్ధులకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రిల్లో రూ.250 వసూలు చేస్తున్నారు.

Updated Date - 2021-03-09T18:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising