ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విలయం..25 రోజుల్లో 5 లక్షల కేసులు

ABN, First Publish Date - 2021-05-16T15:57:49+05:30

రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుకుంది. గత 25 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నైలో తగ్గుముఖం

కోవైలో గృహాలే క్వారంటైన్‌ కేంద్రాలు


చెన్నై/అడయార్: రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుకుంది. గత 25 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో చెన్నైలో గత రెండు రోజులుగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గింది. ఇది నగర వాసులకు కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు కోయంబత్తూరులో కూడా భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలోని అన్ని ఆస్పత్రులు కోవిడ్‌ రోగులతో నిండిపోయాయి. దీంతో కరోనా వైరస్‌ బారినపడినవారిని వారివారి ఇళ్ళలోనే హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


గొలుసుకట్టును తెంచేందుకు చర్యలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో పాజిటివ్‌ కేసులు కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్‌ గొలుసు కట్టుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంది. అయినప్పటికీ వైరస్‌ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా గత 25 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 5,28,985 కేసులు నమోదయ్యాయి. అలాగే, 3,899 మంది మృత్యువాతపడ్డారు. వీటికి శనివారం వెలుగు చూసిన  33,658 కొత్త కేసులు (మరణాలు 303) అదనం. వీటితో కలుపుకుంటే 26 రోజుల్లో మొత్తం కేసులు 5,62,643గా ఉంది.  


చెన్నైలో తగ్గుముఖం 

గత రెండు మూడు రోజుల వరకు చెన్నై నగరంలో ఉధృతంగా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురు, శుక్రవారాల్లో రోజువారి కేసుల సంఖ్య 7 వేలకు దిగువకు పడిపోయింది. శుక్రవారం మొత్తం 6,538 కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చితే 453 కేసులు తక్కువ. కానీ, శనివారం 6,640 కేసులు నమోదయ్యాయి. నగర వ్యాప్తంగా మొత్తం 4,32,344 మందికి ఈ వైరస్‌ సోకింది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 46,367 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌, కోవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా నగరంలో కరోనా మృతుల సంఖ్య కూడా చాలా మేరకు తగ్గుతూ వస్తోంది. గత నాలుగు రోజుల క్రితం వరకు సెంచరీకి చేరువలో ఉన్న మృతులు, శనివారం 82కు తగ్గింది. దీనికి నగరంలో కఠినంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ కారణమని చెప్పుకోవచ్చు. 


వ్యాక్సినేషన్‌ ముమ్మరం

చెన్నైలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇందుకోసం శనివారం నుంచి నగరంలో అదనంగా 152 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ప్రారంభించినట్టు చెన్నై నగర పాలక సంస్థ కమిషనరు గగన్‌ సింగ్‌ బేడీ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్‌ బారినుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్‌ ఒక్కటేనన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. అలాగే, అపార్టుమెంట్‌ల వద్ద ప్రత్యేక వ్యాక్సిన్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన  తెలిపారు. 


కోవైలో పెరుగుతున్న కేసులు

కోయంబత్తూరులో గత రెండు మూడు రోజులుగా వైరస్‌ దూకుడు పెరిగింది. ఫలితంగా, జిల్లాతో పాటు కోవై నగరంలోనూ పాజిటివ్‌ కేసుల రేటు పెరిగింది. దీంతో జిల్లాలోని అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో కిక్కిరిసి పోయాయి. ఈ జిల్లాలో కరోనా వైరస్‌ బాడినపడిన రోగుల్లో 70 శాతం మందికి ప్రాణవాయువు అవసరం అవుతుంది. దీంతో రోగులకు ఆస్పత్రుల్లో పడకలు లభించడం కష్టసాధ్యంగా మారింది. అదేసమయంలో స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని గృహాల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలా హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 7261గా ఉంది. వీరిని వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గత వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఇంటింటి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఒక్క కోవై నగరంలోనే 61.33 శాతం మందికి ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు. జిల్లాలో శనివారం లెక్కల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 1,12,358గా ఉంది. అలాగే, శనివారం రాత్రి గణాంకాల మేరకు 3124 మందికి ఈ వైరస్‌ సోకింది.

Updated Date - 2021-05-16T15:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising