స్మారకాలు, విగ్రహాలను పెట్టబోం

ABN, First Publish Date - 2021-09-08T07:24:44+05:30

: వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రచారాన్ని ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం మాయావతి మంగళవారం ఓ కీలక అంశాన్ని తెరమీదకు తెచ్చారు.

స్మారకాలు, విగ్రహాలను పెట్టబోం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారంలోకి వస్తే పాలనపైనే దృష్టి: మాయావతి

లఖ్‌నవూ, సెప్టెంబరు 7: వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రచారాన్ని ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం మాయావతి మంగళవారం ఓ కీలక అంశాన్ని తెరమీదకు తెచ్చారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రముఖుల విగ్రహాలను పెట్టబోమని.. వారి పేర్ల మీద స్మారకాలు, పార్కులను ఏర్పాటుచేయబోమని హామీ ఇచ్చారు. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి అనేకం చేశామని, ఇప్పుడు అవి అవసరం లేదని చె ప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అత్యుత్త మ పాలనను అందించేందుకు కృషి చేస్తామన్నారు.  


బ్రాహ్మణులను ఆకట్టుకునే యత్నం..

వేద మంత్రాలు, శంఖాల పూరణలు.. జై శ్రీరాం, హర హర మహాదేవ్‌ అంటూ జన సమూహం నుం చి మారుమోగే నినాదాలతో లఖ్‌నవూలోని బీఎస్పీ పార్టీ ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. ప్రబుద్ధ జన సమ్మేళన్‌ పేరుతో మేధావులతో.. మాయావతి మంగళవారం తలపెట్టిన సమావేశానికి ముందు ఈ ఘ ట్టం ఆవిష్కృతమైంది. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణుల ను ఆకట్టుకునేందుకు మాయావతి తన ప్రచారాన్ని ఇలా ప్రారంభించారు. బ్రాహ్మణుల అభివృద్ధి, రక్షణ పై దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. 

Updated Date - 2021-09-08T07:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising