ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 మందికిపైగా వైద్యుల‌ను బ‌లితీసుకున్న‌ క‌రోనా సెకెండ్ వేవ్‌!

ABN, First Publish Date - 2021-05-18T11:02:48+05:30

క‌రోనా సెకెండ్ వేవ్ వైద్యుల‌ను క‌బ‌ళిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: క‌రోనా సెకెండ్ వేవ్ వైద్యుల‌ను క‌బ‌ళిస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం కరోనా సెకెండ్ వేవ్‌లో దేశంలోని 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. గ‌డ‌చిన ఆదివారం ఒక్క‌రోజునే క‌రోనా కార‌ణంగా 50 మంది వైద్యులు మృతి చెందారు. ఒక్క‌ రోజులో అత్యధిక సంఖ్యలో వైద్యులు మరణించడం ఇదే తొలిసారి. 


మీడియాకు అందిన వివరాల ప్ర‌కారం బీహార్‌లో క‌రోనా కార‌ణంగా అత్య‌ధిక సంఖ్య‌లో వైద్యులు మరణించారు. బీహార్‌లో 69 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోగా, ఉత్తర ప్రదేశ్‌లో 34 మంది, ఢిల్లీలో 27 మంది వైద్యులు మరణించారు. కరోనాకు పిన్న‌వ‌య‌స్కుడైన‌ డాక్టర్ అనాస్ ముజాహిద్ బ‌ల‌య్యారు. ఆయ‌న ఢిల్లీలోని గురు తేజ్‌ బహదూర్ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్. గత ఏడాది క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో దేశంలోని 730 మంది వైద్యులు మృతిచెందారు. కాగా దేశంలో అత్య‌ధిక‌శాతం వైద్య నిపుణులు టీకా మొదటి మోతాదు తీసుకున్నారు.

Updated Date - 2021-05-18T11:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising