ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీరీలకు నిర్ణయాధికారం ఉండాలి : ఇమ్రాన్ ఖాన్

ABN, First Publish Date - 2021-03-17T20:33:56+05:30

భారత దేశంలోని కశ్మీరీలకు నిర్ణయాధికారం ఉండాలని పాకిస్థాన్ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : భారత దేశంలోని కశ్మీరీలకు నిర్ణయాధికారం ఉండాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వారు తమ జీవితాలను తామే నిర్ణయించుకోవడానికి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి హక్కులను కల్పించిందన్నారు. ఆ హక్కులను వారికి భారత దేశం ఇవ్వాలన్నారు. భారత దేశంతో సత్సంబంధాలకు కశ్మీర్ సమస్య అడ్డంకిగా నిలుస్తోందని, కశ్మీరు సమస్యను పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత దేశం తొలి అడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరిగే ఇస్లామాబాద్ సెక్యూరిటీ డయలాగ్‌లో పాకిస్థాన్ మేధావులను ఉద్దేశించి బుధవారం ఇమ్రాన్ మాట్లాడారు. 


కాల్పుల విరమణకు అంగీకారం

ఫిబ్రవరి 24 అర్ధ రాత్రి నుంచి జమ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరు దేశాల సైన్యాలు అంగీకారానికి వచ్చాయి. భారత్-పాక్ మధ్య తెర వెనుక జరిగిన ప్రయత్నాల ఫలితంగా ఈ అంగీకారం కుదిరింది. ఈ అవగాహన అమల్లోకి వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. 


ఆ ఒక్కటే అడ్డంకి

ఇమ్రాన్ ఖాన్ బుధవారం మాట్లాడుతూ, ఈ సమయంలో భారత్-పాక్ మధ్య సత్సంబంధాలను అడ్డుకుంటున్న సమస్య ఒకటి ఉందని, పాకిస్థాన్ తన కృషి తాను చేస్తుందని, అయితే భారత దేశమే మొదటి అడుగు వేయాలని అన్నారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, దురదృష్టవశాత్తూ ఆగస్టు 5 నేపథ్యంలో భారత్ మొదటి అడుగు వేసే వరకు మనం ముందడుగు వేయలేమని చెప్పారు. 


‘‘ప్రధానంగా మన సమస్య కశ్మీరే. అదొక్కటే సమస్య. దీనిని చర్చల ద్వారా ఎలా పరిష్కరించుకుంటాం? నాగరిక పొరుగు దేశాలుగా సంబంధాలను ఎలా ఏర్పరచుకుంటాం? అనేదే ముఖ్యాంశం’’ అని చెప్పారు.  2018లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాను భారత దేశంతో అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆగస్టు 5 ఒకటి ఉందని, ఇది చాలా పెద్ద దెబ్బ అని, దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పారు. 


కశ్మీరీలకు హక్కులివ్వాలి

కశ్మీరీలు తమ జీవితాలను తామే నిర్ణయించుకునే హక్కును ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కల్పించిందని చెప్పారు. వారికి ఆ హక్కులను భారత దేశం ఇస్తుందని తాము ఇప్పటికీ ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల భారత దేశానికి, అదే విధంగా పాకిస్థాన్‌కు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 


చర్చల ద్వారా కశ్మీరు సమస్య పరిష్కారానికి కదలిక వస్తే, ఈ ప్రాంతం మొత్తం మారిపోతుందని చెప్పారు. దీనివల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. భారత దేశంలో పేదరికం అధికంగా ఉన్నందువల్ల ఆ దేశానికి కూడా లాభం కలుగుతుందన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ఆర్థిక, వాణిజ్య సంబంధాలు బలంగా ఉండాలని, ప్రాంతీయ అనుసంధానం పెరగాలని అన్నారు. సెంట్రల్ ఆసియాతో అనుసంధానమైతే భారత దేశానికి లబ్ధి కలుగుతుందని చెప్పారు. 


ఇదిలావుండగా, భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ శృంగ్లా సోమవారం మాట్లాడుతూ, అర్థవంతమైన చర్చల కోసం తగిన వాతావరణాన్ని ఏర్పరచవలసిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని చెప్పారు. 



Updated Date - 2021-03-17T20:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising