ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడే కరోనా అంతం : డాక్టర్ హర్షవర్ధన్

ABN, First Publish Date - 2021-05-21T01:41:22+05:30

కరోనా మహమ్మారి అంతం కావాలంటే మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి అంతం కావాలంటే మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ఆ వ్యాక్సిన్ల సమర్థత పరీక్షించిన తర్వాత ప్రపంచం మొత్తానికి వాటిని అతి వేగంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖా మంత్రుల 33 వ కామన్ వెల్త్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కరోనా అంతానికి డబ్ల్యూహెచ్‌వో సారథ్యంలో అన్ని దేశాలూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి, అభివృద్ధికి, అందరికీ అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2021 నాటికి 2 బిలియన్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి లక్ష్యంగా ‘కోవ్యాక్స్’ ముందుకు సాగుతోందని తెలిపారు. అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతోనే భారత్ అడుగులు వేస్తోందని, ఆయుష్మాన్ భారత్  కార్యక్రమం కింద ఈ దిశగా వెళ్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫాం ‘ఈ సంజీవని ఓపీడీ’ కింద 14 నెలల స్వల్ప వ్యవధిలో 5 మిలియన్లకు పైగా సంప్రదింపులకు వీలు కల్పించినట్లు తెలిపారు. ‘వసుదైవ కుటుంబకం’ అన్న సూత్రాన్ని తాము శతధా విశ్వసిస్తున్నామని, అందుకే ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద ఇతర దేశాలకు వ్యాక్సిన్లను పంపామని హర్షవర్ధన్ ప్రకటించారు. 


Updated Date - 2021-05-21T01:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising