కులాంతర వివాహం చేసుకున్న జంటపై 28 ఏళ్ల తర్వాత దాడి
ABN, First Publish Date - 2021-07-12T03:22:08+05:30
కర్ణాటక రాష్ట్రంలో వెనుకబడిన కులాలపై దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌పై దాడులు జరిగినట్లు 2,327 కేసులు నమదు అయ్యాయని కర్ణాటక ప్రభుత్వ అధికారిక
బెంగళూరు: కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు జరగడం సహజమే. అయితే కులాంతర వివాహం చేసుకున్న 28 ఏళ్లకు దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలో రోన్‌తక్ ప్రాంతంలో 28 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్న ఓ జంటపై భర్త బంధువులు దాడికి పాల్పడ్డారు. భర్త పైకులానికి చెందినవాడు కాగా, భార్య వాల్మీకి కులానికి చెందిన వ్యక్తి. ఈ కారణంతోనే భర్త బంధువులు వారిపై దాడికి పాల్పడ్డట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో భార్య గాయపడ్డట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని బెంగళూరు 385 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదగ్ జిల్లా రోన్ తాలూకాలో జూలై 8న ఈ సంఘటన జరిగింది. అయితే తమ పేర్లు బయటికి చెప్పొద్దని విజ్ణప్తి చేయడం వల్ల ఈ విషయం బయటికి రాలేదని పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలో వెనుకబడిన కులాలపై దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌పై దాడులు జరిగినట్లు 2,327 కేసులు నమదు అయ్యాయని కర్ణాటక ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 54 శాతం కేసులు ఈసారి పెరిగాయట. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ క్రైం బ్యూరో తెలిపింది. హత్యలు, భౌతికదాడి, అత్యాచారాలు ఇతర నేరాలు ఎస్సీ, ఎస్టీలపై సాధారణమయ్యాయి. వాస్తవానికి నమోదు అవుతున్న కేసులు చాలా తక్కువని, నమోదు కానీ దాడులు అనేకమని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2021-07-12T03:22:08+05:30 IST