ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం మమతపై నడ్డా ఫైర్

ABN, First Publish Date - 2021-05-29T02:11:43+05:30

ప్రధాని మోదీ తుపాను సమీక్షా సమావేశానికి సీఎం మమత ఇలా వచ్చి, అలా వెళ్లడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ తుపాను సమీక్షా సమావేశానికి సీఎం మమత ఇలా వచ్చి, అలా వెళ్లడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. మమత బెనర్జీ తన అహంకారాన్ని పక్కన పెడితే బాగుంటుందని సూచించారు. యాస్ తుపాను విషయంలో ప్రజలకు మేలు చేయడానికి పార్టీల కతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తూనే ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. ‘‘ఎస్ తుపానును దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ బెంగాల్  ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. అటు సీఎం మమత కూడా ప్రజా క్షేమం దృష్ట్యా అహంకారాన్ని పక్కన పెట్టాలి. ప్రధాని నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. ఫెడలరిజం సంప్రదాయాన్ని విడిచిపెట్టినట్లే. మమత అహంకార రాజకీయాలు మరోసారి బెంగాల్ ప్రజలకు నష్టం వాటిల్లేలా చేస్తున్నాయి’’ అంటూ నడ్డా సీఎం మమతపై విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-05-29T02:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising