ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్‌ పుష్ప పదవీకాలం మరో ఏడాది పొడిగింపు!

ABN, First Publish Date - 2021-02-13T07:03:15+05:30

రెండు లైంగిక వేదింపుల కేసుల్లో వివాదాస్పదమైన తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప పదవీకాలాన్ని అదే స్థాయిలో మరో ఏడాది పాటు కొనసాగిస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు న్యాయమూర్తిగానే..

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రెండు లైంగిక వేదింపుల కేసుల్లో వివాదాస్పదమైన తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప పదవీకాలాన్ని అదే స్థాయిలో మరో ఏడాది పాటు కొనసాగిస్తూ.. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లే ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందుతారు. అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ పుష్ప.. తన రెండేళ్ల పదవీకాలాన్ని శుక్రవారంతో పూర్తి చేసుకున్నారు. కానీ, ఆమెను అదే స్థానంలో ఉంచుతూ.. మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.


నిజానికి జస్టిస్‌ పుష్పను బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీం కొలీజియం గతంలో సిఫారసు చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో లైంగిక వేధింపుల కేసుల్లో ఆమె వెలువరించిన రెండు తీర్పులు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. సుప్రీం కొలీజియం తమ సిఫారసును వెనక్కి తీసుకుంది.


అలాగే, ఆమెను మరో రెండేళ్లపాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించాల్సిందిగా రెకమెండ్‌ చేసింది. కానీ, సుప్రీం సిఫారసును పునఃపరిశీలనకు తీసుకున్న కేంద్రం.. తాజాగా ఏడాది మాత్రమే ఆమె పదవీకాలాన్ని పొడిగించడం గమనార్హం.


Updated Date - 2021-02-13T07:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising