ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1250 కోట్లతో కోవిడ్ రిలీఫ్ ఫండ్.. ప్రకటించిన సీఎం

ABN, First Publish Date - 2021-05-20T00:42:17+05:30

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ లక్షల మంది కబళిస్తూ వేల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి బారి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ లక్షల మంది కబళిస్తూ వేల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం తాజాగా రూ.1250 కోట్ల కొవిడ్-19 రిలీఫ్ ఫండ్‌ను ప్రకటించింది. కరోనా వల్ల ఆర్థికంగా అవస్థలు పడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు ఈ ఫండ్‌ను వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన వెలువరించింది. దాని ప్రకారం.. రాష్ట్రంలోని ఆటో, టాక్సీ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులందరికీ ఒక్కొక్కరికీ రూ.3 వేలు, అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ఒక్కొకరికీ రూ.2వేలు చొప్పున ప్రభుత్వం అందించబోతోంది. ఇక పూల పెంపకం, ఉద్యాన పంటల పెంపకంలో ఉన్న రైతులకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇవ్వనుంది. అంతేకాకుండా ఆత్మనిర్భర్ స్కీమ్‌లో రిజిస్టర్ అయిన ఉన్న వీది వ్యాపారులకు ఒక్కొక్కరికీ రూ.2 వేలు చొప్పున ఇవ్వనుంది.

Updated Date - 2021-05-20T00:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising