ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో వెనుకడుగు ప్రశ్నే లేదు..: మంత్రి

ABN, First Publish Date - 2021-07-06T18:31:38+05:30

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రైతాంగానికి ఎంతగానో వినియోగపడే మేకెదాటు పథకం విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై తేల్చి చెప్పారు. నగరంలో సోమవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై


బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రైతాంగానికి ఎంతగానో వినియోగపడే మేకెదాటు పథకం విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై తేల్చి చెప్పారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేకెదాటు వివాదం చాలాకాలంగా సాగుతోందని, ప్రతిసారి తమిళనాడు ప్రభుత్వం ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తుతూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి రాసిన లేఖలో వాడిన భాష ఏమాత్రం బాగోలేదన్నారు. కావేరీ బేసిన్‌లో రైతుల ప్రయోజనాల రక్షణ విషయంలో రాజీ పడబోమన్నారు. మేకెదాటు పథకం ప్రారంభమైతే ఉభయరాష్ట్రాల రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, సాగు, తాగునీరు సాధ్యమవుతుందని, జల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని బొమ్మై వివరించారు. తమిళనాడు ఒత్తిళ్లను కేంద్రం పట్టించుకోబోదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. కాగా కేరళ సరిహద్దులో శాటిలైట్‌ ఫోన్‌ వాడకం అధికంగా ఉన్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయన్నారు. వీటిపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా పోలీసులకు సూచించామన్నారు. కేరళ సరిహద్దులో అటవీసంపద దోచుకునేందుకు ప్రత్యేకించి శ్రీగంధం చెట్లపై కన్నేసిన కొందరు ఉపగ్రహాల ఆధారంగా పనిచేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫోన్‌లను వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. 

Updated Date - 2021-07-06T18:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising