మళ్లీ పెళ్లి చేసుకున్న మెకెంజీ స్కాట్
ABN, First Publish Date - 2021-03-09T07:58:30+05:30
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్ టీచర్ డాన్ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ విషయాన్ని జీవెట్ ఓ
సైన్స్ టీచర్‌ను వివాహమాడిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ మాజీ భార్య
న్యూఢిల్లీ, మార్చి 8: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్ టీచర్ డాన్ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ విషయాన్ని జీవెట్ ఓ వెబ్‌సైట్ లో పంచుకున్నారు. 50 ఏళ్ల స్కాట్ 53 బిలియన్ డాలర్ల సంపద తో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. జెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 25 ఏళ్ల తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. విడిపోయాక స్కాట్‌కు అమెజాన్ నుంచి 38 బిలియన్ డాలర్ల షేర్లు లభించాయి. ఆమెకు అమెజాన్‌లో ఇప్పుడు 4ు వాటా ఉంది. కొవిడ్ సహాయక చర్యల్లో భాగంగా స్కాట్ గత ఏడాది పలు ఆహార పంపిణీ కేంద్రాలు, అత్యవసర సహాయ నిధి కింద 4.1 బిలియన్ డాలర్ల విరాళాన్ని అందించారు. జాతి సమానత్వం, స్వలింగ సంపర్కుల హక్కులు, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం గత ఏడాది స్కాట్ 1.7 బిలియన్ డాలర్ల విరాళాన్ని ఇచ్చారు.
Updated Date - 2021-03-09T07:58:30+05:30 IST