ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh: ఉత్తమ పర్యాటక గ్రామంగా లధ్‌పురా ఖాస్

ABN, First Publish Date - 2021-09-11T17:19:38+05:30

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని లధ్‌పురా ఖాస్ గ్రామం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అవార్డుకు ఎంపికైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అవార్డు

భోపాల్ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని లధ్‌పురా ఖాస్ గ్రామం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అవార్డుకు ఎంపికైంది.ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ అవార్డుకు మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లాలోని లధ్‌పురా ఖాస్ ఉత్తమ పర్యాటక గ్రామం విభాగంలో ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఓర్చా సమీపంలోని లధ్‌పురా ఖాస్ గ్రామాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నామినేట్ చేసింది. దీంతో పాటు కొంగ్ థాంగ్ గ్రామం(మేఘాలయ), తెలంగాణాల నుంచి ఓ గ్రామం ఎంపికైనట్లు మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ షియో శేఖర్ శుక్లా చెప్పారు.


 లధ్‌పురా ఖాస్ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా నామినేట్ చేసినందుకు పర్యాటక శాఖ అధికారులు, ఉద్యోగులందరినీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. ఇది రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం పేర్కొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రామీణ పర్యాటక దృక్కోణం నుంచి 100 గ్రామాలు అభివృద్ధి చేయనున్నారు. వీటిలో ఓర్చా, ఖజురాహో, మండు, సాంచి, పాచ్‌మరహి, తామియా, పన్నా గ్రామాలను ఎంపిక చేశారు. 


Updated Date - 2021-09-11T17:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising