ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌హారాష్ట్ర‌లో త‌గ్గిన క‌రోనా కేసులు

ABN, First Publish Date - 2021-05-30T11:56:15+05:30

మహారాష్ట్రలో గ‌డ‌చిన 24 గంటల్లో కొత్త‌గా 20,295 కరోనా వైరస్ కేసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో గ‌డ‌చిన 24 గంటల్లో కొత్త‌గా 20,295 కరోనా వైరస్ కేసులు, 443 కోవిడ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 57,13,215 కు చేర‌గా, మృతుల సంఖ్య 94,030కు చేరింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మీడియాకు వెల్ల‌డించింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 31,964 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మహారాష్ట్రలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 53,39,838 కు చేరిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. 


మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 2,76,573గా ఉంది. కొత్త‌గా 2,58,799 క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 3,46,08,985కు చేరింది. రాష్ట్రంలో శుక్రవారం 20,740 కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మయంలో 424 మంది క‌రోనా కార‌ణంగా క‌న్నుమూశారు. ప్రస్తుతం ముంబైలో 27,617 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటివరకు 6 లక్షల 59 వేల 899 మంది కోలుకున్నారు. ముంబైలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 14,833 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 మహమ్మారి థ‌ర్ద్ వేవ్‌ ముప్పు దృష్ట్యా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో 50 పడకల పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మ‌హారాష్ట్ర స‌ర్కారు యోచిస్తోంది. థ‌ర్డ్ వేవ్‌లో పిల్లలు ప్రభావితం అయ్యే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని, అన్నిర‌కాల వైద్య స‌దుపాయాల‌ను అందుబాటులో ఉంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు ఔరంగాబాద్ సివిల్ సర్జన్ డాక్టర్ సుందర్ కులకర్ణి మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-05-30T11:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising