ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonia తో భేటీ అయిన Mamatha banerjee

ABN, First Publish Date - 2021-07-28T22:42:36+05:30

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ప్రస్తుతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు.  ప్రస్తుతం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రతిపక్ష సభ్యులందర్నీ కలుసుకుంటానని ఆమె ప్రకటించారు. విపక్ష సభ్యులతో పాటు ప్రధాని మోదీతో కూడా ఆమె భేటీ అయ్యారు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, సోనియాతో భేటీ కావడం ఇదే ప్రథమం. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. భేటీ తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ...  ‘‘సోనియా నన్ను చాయ్ తాగడానికి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నారు. రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నాం. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకం కావాలని భావిస్తున్నాం. పెగాసస్, కోవిడ్ పరిస్థితులతో పాటు ప్రతిపక్షాల ఐక్యత లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సమావేశం బాగా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సమావేశంతో సత్ఫలితాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాను’’ అని మమత ప్రకటించారు. 


 బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్నాయ కూటమికి మమత ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సోనియాతో భేటీ కానున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఫ్రంట్‌కు సోనియా గాంధీ కూడా సుముఖంగానే ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీకి సోనియా గాంధీ ‘చాయ్ పే చర్చ’ అన్న పేరును పెట్టారని మమత వెల్లడించారు. అంతకు మునుపు జరిగిన విలేకరుల సమావేశంలో మమత మాట్లాడుతూ... సోనియా గాంధీ కూడా ప్రతిపక్షాల ఐక్యతనే కోరుకుంటున్నారని, ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ విశ్వసిస్తుందని, ఆ పార్టీని ప్రాంతీయ పార్టీలు విశ్వసిస్తాయని మమత ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2021-07-28T22:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising